భయము చెందకు భక్తుడా
Bhayamu Chemdaku Bhakthudaa
Added on 2/5/2017
Lyrics
భయము చెందకు భక్తుడా ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు జీవమిచ్చిన యెహొవున్నాడు ఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు ||భయము|| బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే నాల్గవ వాడు ఉండలేదా ఓ భక్తుడా.. నాల్గవ వాడు ఉండలేదా ||భయము|| చెరసాలలో వేసినా తన దేహమంతా.. గాయాలతో నిండినా పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ భూకంపం కలుగ లేదా ఆ భక్తులు ముగ్గురు.. చెరనుండి విడుదల కాలేదా ||భయము|| ఆస్తి అంతా పోయినా తన దేహమంతా.. కురుపులతో నిండినా అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయె అని యోబు పలుక లేదా ఓ భక్తుడా.. అని యోబు పలుక లేదా ||భయము||