వెన్నెల్లా తాకాలి
Vennella taakaali
Lyricistజోషువా షైక్
Added on 2/12/2026
Lyrics
వెన్నెల్లా తాకాలి గుండెల్లో ఉండాలి వెన్నంటే రావాలి నీ ప్రేమ యేసయ్య కన్నుల్లో నిండాలి నీడల్లే సాగాలి చల్లంగా చూడాలి నీ ప్రేమ యేసయ్య ఊహకందని భాషకందని అంతులేని ప్రేమ ఎన్నడైనను ఎప్పుడైనను వీడిపోని ప్రేమ మధురమైన ప్రేమ 1. ఎడారైన యాత్రలోన విషాదాల బాటలోన ప్రేమ చూపి ఆదరించే నాదు రక్షకా ప్రతీ చోట ఓటమైన ప్రతీ మాట మోసమైన చేయి చాపి లేపినావు నాదు యేసయ్య కలకానీ కధలోన - నను నడిపే నిజమైన నీ ప్రేమేగా 2. లోకమంత ఏకమైన కానరాని తీరమైన నీదు ప్రేమ చాలు నాకు నాదు యేసయ్య నిరీక్షించు వేళలోన సదా నన్ను చేరుకున్న ఎంత గొప్ప ప్రేమ నీది నీతిసూర్యుడా ఇలలోన బలమైన - కధ మార్చే వరమైన నీ ప్రేమేగా