యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా

Yaesu Kreesthuni Mmchi Shishyulamugaa

Lyricistసీయోను గీతములు
UncategorizedAdded on 1/29/2026

Lyrics

యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా
విశ్వాసముతో సాగెదము
మనమందరము ఆయన సేవను
ఏకమై సదా జేసెదం
మన యేసు ప్రభువు శీఘ్రముగ వచ్చును
అతి వేగముగా సేవ చేతుము
||యేసు క్రీస్తుని||
అందరి యెడల ప్రేమ జూపెదం
యేసు చెంతకు పిలిచెదము
అతి శీఘ్రంబుగా ఉత్సాహంబుతో
రాజ మార్గమును చూపెదము
||మన యేసు||
సాతాను దుర్గమును పడగొట్టి
ఇక యేసు కొరకే జీవింతుము
ఈ లోకమంతటన్ ప్రభు యేసు నామమున్
ఎల్ల వేళలందు చాటెదము
||మన యేసు||
ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే
ఇక జీవించుట తన కొరకే
అని నిశ్చయించుచు అందు నిలిచియుండి
ప్రభు దినమందు హర్షింతుము
||మన యేసు||

Video