దేవా నీ ఆవరణం
Daevaa Nee Aavaranm
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 10/23/2025
Lyrics
దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం ఒక ఘడియ యిచట గడుపుట మేలు వేయి దినములకంటెను అద్బుత కార్యములు ఆ… జరిగించు దేవుడవు ఆ…. అనవరతమునీ మహిమలు పొగడ ఆత్మలో నిలుపుమయా అత్మతో సత్యముతో ఆరాధించగ మనసుతో ఆల్ఫా ఓమేగయు ఆత్మ రూపుడవు ఆనందించగ నీ ఒడిలో ||దేవా|| అత్యంత పరిశుద్ధమౌ ఆ…. నీదు గుడారమున ఆ….. నివసించుటకు యోగ్యత నొసగి మమ్ము హెచ్చించితివి నీ దయన్ జు౦టె ధారల కన్నను తేనె మధురిమ కన్నను శ్రేష్టమౌ నీదు వాక్కులచేత మము తృప్తి పరచుమయా ||దేవా|| పరిశుద్ధ సన్నిధిలో ఆ… పరిశుధ్దాత్ముని నీడలో ఆ…. పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభునే ప్రస్తుతించెదం మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం ప్రాణ ప్రియుడవు పదముల జేరి ప్రాణార్పణము చేతుము ||దేవా||