అంత్యకాల అభిషేకం

Amthyakaala Abhishaekm

UncategorizedAdded on 2/7/2026

Lyrics

కోతకాల దినములివి – తండ్రి నీ ఆత్మతో నింపుమా
మండే అగ్నల్లె రా దేవా
అన్య భాషలతో అభిషేకించు
ఎగసే గాలల్లె నను తాకుమా
జీవనది వలెనే ప్రవహించుమా
(2)       ||అంత్యకాల||
ఎముకల లోయలోన
గొప్ప సైన్యము నే చూడగా
నీ అధికారం దయచేయుమా
జీవమా రమ్మని ప్రవచించెద
||మండే||
కర్మెలు కొండ పైన
గొప్ప మేఘమై ఆవరించగా
ఆహాబు భయపడిన
అగ్ని వర్షము కుమ్మరించుమా
||మండే||
సీనాయి పర్వతమందు
అగ్ని పొద వలె నిను చూడగా
ఓ ఇశ్రాయేలు దైవమా
మాతో కూడా ఉన్నవాడా
||మండే||

Video