మారిపోవాలి ఈ లోకమంతా

Maaripovaali Ee Lokammthaa

Added on 2/3/2015

Lyrics

మారిపోవాలి ఈ లోకమంతా
చేరరావాలి ప్రభుయేసు చెంత
మంచి మనలోన పెంచాలి ఎప్పుడూ
పంచుకోవాలి పరవారితో
||మారిపోవాలి||
మనము వెలగాలి ఒక దివ్య వెలుగై
వెలిగించాలి ఈ జగతినంతా
కదలి రావాలి కరుణంత మనలో
కరిగిపోవాలి కఠినాత్ములంతా
||మారిపోవాలి||
మనము బ్రతకాలి విలువైన బ్రతుకు
బ్రతికించాలి ప్రభుయేసు బోధ
ఆదుకోవాలి నర జాతినంతా
అందించాలి ప్రభు వాక్యమెంతో
||మారిపోవాలి||
మనము నిలవాలి మాదిరిగా ఎప్పుడూ
మహిమ పొందాలి ప్రభు యేసు అప్పుడూ
వినిపించాలి మన సాక్ష్యమంతా
కదిలించాలి హృదయాలనంతా
||మారిపోవాలి||

Video