మార్పుచెందవా

Maarpuchemdavaa

Added on 11/8/2015

Lyrics

మార్పుచెందవా నీవు మర్పుచెందవా
నీ బ్రతుకు మార్చుకోవా
అనుకూల సమయం ఇదియేనని ఎరిగి
మారు మనసునూ పొందవా
ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని
ఏమున్నది ఈ లోకంలో
ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి
తీర్పున్నది పై లోకంలో
తీర్పు దినమునందున ఆయన ముందు నీవు
నిలిచే ధైర్యం నీకుందా
నిలిచే ధైర్యం నీకుందా
||మార్పుచెందవా||
దిగంబరిగానే వచ్చావు నీవు
దిగంబరిగా పోతావు
మన్నైన నీవు మన్నై పోతావు
ఏదో ఒక దినమందున
నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు
నీవెంట రావెన్నడు
నీవెంట రావెన్నడు
||మార్పుచెందవా||
ఆత్మని కాక దేహాన్ని చంపే
మనుషులకే భయపడకయ్యా
ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే
దేవునికే భయపడవయ్యా
దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు
నీకంటూ ఏముందిలే
నీకంటూ ఏముందిలే
||మార్పుచెందవా||

Video