మీరు బహుగా ఫలించినచో

Meeru Bahugaa Phalimchinacho

Added on 4/1/2016

Lyrics

మీరు బహుగా ఫలించినచో
మహిమ కలుగును తండ్రికి
ఈ రీతిగా ఫలించినచో
శిష్యులై యుండెదరు
నీరు కట్టిన తోటవలె
నీటి వూటవలె నుండెదరు
క్షామములో తృప్తి నిచ్చి
క్షేమముగా మిమ్ము నడిపించును
బలపరచును మీ యెముకలను
అధికముగా ఫలించుడి
చెట్లులేని మెట్టలలో
నదుల ప్రవహింపజేయు ప్రభువు
ఎండియున్న నేలనెల్ల
నీటిబుగ్గలుగా జేయువాడు
మన ప్రభువైన యేసునందు
అధికముగా ఫలించుడి
వడిగా ప్రవహించు నదిని బోలి
విస్తరింపజేయు తన శాంతిని
ఐశ్వర్యముతో నింపు మిమ్ము
ముదిమివరకు మిమ్ము మోయువాడు
మన ప్రభువైన యేసునందు
అధికముగా ఫలించుడి
పాడెదరు మూగవారు
గంతులు వేసేదరు కుంటివారు
పొగడెదరు ప్రజలెల్లరు
ప్రభుని ఆశ్చర్య కార్యములను
మహిమ ఘనత చెల్లించుచు
హల్లెలూయ పాడెదరు