నాదు జీవితము

Naadu Jeevithamu

Added on 1/19/2016

Lyrics

నాదు జీవితము మారిపొయినది
నిన్నాశ్రయించిన వేళ
నన్నాదుకుంటివి ప్రభువా
||నాదు||
చాలునయ్యా దేవా – ఈ జన్మ ధాన్యమే ప్రభువా
పాప కూపము విడిచి – నీ దారి నడచితి దేవా
నిన్నాశ్రయించితి ప్రభువా..
||నాదు||
కన్ను గానని దిశగా – బహు దూరమేగితినయ్యా
నీ ప్రేమ వాక్యము వినగా – నా కళ్ళు కరిగెను దేవా
నిన్నాశ్రయించితి ప్రభువా..
||నాదు||
లోకమంతా విషమై – నరకాగ్ని జ్వాలలు రేగే
ఆ దారి నడపక నన్ను – కాపాడినావని దేవా
నిన్నాశ్రయించితి ప్రభువా..
||నాదు||
జాలిగల నా ప్రభువా – నీ చేయి చాపవా ప్రభువా
చేరగల నీ దరికి – నే పాపినయ్యా ప్రభువా
నే పాపినయ్యా ప్రభువా..
||నాదు||
ఆరిపోని జ్యోతివై – కన్నులలోని కాంతివై
ఎంత కాలముంటివి – ఎంతగా ప్రేమించితివి
నన్నెంతగా ప్రేమించితివి..
||నాదు||

Video