నీవే నా ఆశ
Neevae Naa Aasha
Added on 3/26/2024
Lyrics
ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించు వారు లేరెవ్వరు కొండల తట్టు నా కన్నులెత్తి నిరాశలో నిన్నే పిలిచాను చీకటి తొలగించి నీ ప్రేమతోనే నా హృదయమును నింపావు లేఖనాలన్ని నెరవేర్చినావు యేసు రాజా నీవే నా ఆశ ఊహించలేని నీ గొప్ప కృపను సమృద్ధిగానే పొందితిని యుగముల రాజా మహిమను వీడి అవమానమునే భరియించావు సిలువలో నేను క్షమనే పొందాను నీ సొత్తుగా నన్నే మార్చావు నా రక్షకా నీ వాడను నేను యేసు రాజా నీవే నా ఆశ హల్లెలూయా నిన్నే ఆరాధింతును హల్లెలూయా మరణమునే గెలిచావు బంధకాలను తెంచావు నీ నామములో రక్షణ యేసు రాజా నీవే నా ఆశ వచ్చింది ఉదయం నెరవేరే వాగ్ధానం సమాధిలో దేహం ఊపిరి పీల్చెన్ మరణముకు నాపై అధికారం లేదని మౌనమునే వీడి చాటించావు యేసు.. నీదే విజయము హల్లెలూయా నిన్నే ఆరాధింతును హల్లెలూయా మరణమునే గెలిచావు బంధకాలను తెంచావు నీ నామములో రక్షణ యేసు రాజా నీవే నా ఆశ యేసు రాజా నీవే నా ఆశ దేవా నీవే నా ఆశ