ఊహించలేని మేలులతో నింపిన
Oohimchalaeni Maelulatho Nimpina
Added on 11/26/2014
Lyrics
ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ ||ఊహించలేని|| మేలుతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియింతును నీ నామమున్ ||ఊహించలేని|| నా దీనస్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ||ఊహించలేని||