పోరాటం ఆత్మీయ పోరాటం
Poraatm Aathmeeya Poraatm
Added on 1/19/2016
Lyrics
పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు – ఈ పోరాటం ఆగదు సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి నా యేసుతో కలిసి పోరాడుచున్నాను అపజయమే ఎరుగని జయశీలుడాయన నా యేసు కొరకే సమర్పించుకున్నాను ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ||పోరాటం|| నా యేసు వెళ్ళిన మార్గము లేనని అవమానములైనా ఆవేదనలైనా నా యేసు కృపనుండి దూరపరచలేవని ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ||పోరాటం|| ఆదియు అంతము లేనివాడు నా యేసు ఆసీనుడయ్యాడు సింహాసనమందు ఆ సింహాసనం నా గమ్యస్థానం ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ||పోరాటం||