రాకడ ప్రభుని రాకడ

Raakada Prabhuni Raakada

Added on 11/5/2015

Lyrics

రాకడ ప్రభుని రాకడ
రాకడ రెండవ రాకడ
ఏ దినమో ఏ ఘడియో
ఎవ్వరు ఎరుగనిది
రెప్పపాటున కాలమున తప్పక వచ్చునది
||రాకడ||
నోవాహు దినములలో జరిగినట్లుగా
లోతు కాలమున సాగినట్లుగా
పాపమందు ప్రజలంతా మునిగి తేలగా
లోకమంతా దేవుని మరచియుండగా
మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా
మహిమతో తన ప్రజల చేర పిలుచుగా
దేవుని మరచిన ప్రజలందరిని
సువార్తకు లోబడని జనులందరిని
శ్రమల పాలు చేయను ప్రభువు వచ్చును
అగ్ని జ్వాలలతో అవని కాల్చును
వేదనతో భూమినంత బాధపరచును
తన మహిమను ప్రజలకు తెలియపరచును

Video