సమర్ధవంతుడవైన
Samardhavmthudavaina
Added on 11/20/2015
Lyrics
సమర్ధవంతుడవైన నా యేసయ్యా సమస్తము నీకు సాధ్యమేనయ్యా నా స్తుతి యాగము నీకే నా ప్రాణార్పణ నీకే నా సర్వస్వము నీకే నా జీవన గానము నీకే ||సమర్ధ|| పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే యేసయ్యా ఆత్మ జలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా నే వెళ్ళు మార్గమునందు నా పాదము జారకుండా దూతల చేతులలో నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా నీ ||సమర్ధ|| శత్రువు చరలోనుండి నను భద్రముగా నిల్పువాడవు నీవే యేసయ్యా రక్షణ వస్త్రమును నిత్యము నాపై కప్పువాడవు నీవే యేసయ్యా జీవించు దినములన్నియు నాలో పాపము ఉండకుండా రక్తపు బిందువుతో నన్ను కడుగువాడవు నీవే యేసయ్యా నీ ||సమర్ధ||