సిలువలో సాగింది యాత్ర
Siluvalo Saagimdi Yaathra
Added on 11/5/2013
Lyrics
సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ||సిలువలో|| పాలు కారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ ||ఇది ఎవరి|| వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు గేలి చేసినారు పరిహాసమాడినారు నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ ||ఇది ఎవరి||