వేటగాని ఉరిలో నుండి
Vaetagaani Urilo Numdi
Added on 11/12/2014
Lyrics
వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడెమా ఆరాధన ఆరాధన – నా తండ్రి నీకే ఆరాధన ఆరాధన ఆరాధన – నా యేసు నీకే ఆరాధన రాత్రి వేళ భయముకైననూ పగటి వేళ బాణమైననూ రోగము నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు ||లేనే లేదయ్యా|| వేయిమంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు ||లేనే లేదయ్యా|| మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు ||లేనే లేదయ్యా||