యేసే నా పరిహారి

Yaesae Naa Parihaari

Added on 3/24/2015

Lyrics

యేసే నా పరిహారి
ప్రియ యేసే నా పరిహారి
నా జీవిత కాలమెల్ల
ప్రియ ప్రభువే నా పరిహారి
||యేసే నా||
ఎన్ని కష్టాలు కలిగిననూ
నన్ను కృంగించె భాదలెన్నో
ఎన్ని నష్టాలు వాటిల్లినా
ప్రియ ప్రభువే నా పరిహారి
||యేసే నా||
నన్ను సాతాను వెంబడించినా
నన్ను శత్రువు ఎదిరించినా
పలు నిందలు నను చుట్టినా
ప్రియ ప్రభువే నా పరిహారి
||యేసే నా||
మణి మాన్యాలు లేకున్ననూ
పలు వేదనలు వేధించినా
నరులెల్లరు నను విడచినా
ప్రియ ప్రభువే నా పరిహారి
||యేసే నా||
బహు వ్యాధులు నను సోకినా
నాకు శాంతి కరువైనా
నను శోధకుడు శోధించినా
ప్రియ ప్రభువే నా పరిహారి
||యేసే నా||
దేవా నీవే నా ఆధారం
నీ ప్రేమకు సాటెవ్వరూ
నా జీవిత కాలమంతా
నిన్ను పాడి స్తుతించెదను
||యేసే నా||

Video