యేసయ్యా నా దొరా
Yaesayyaa Naa Doraa
Added on 1/27/2016
Lyrics
యేసయ్యా నా దొరా నీ సాటి ఎవరయ్యా ఈ ధర నా కోసమే వచ్చిన సర్వేశ్వరా నను విడిపించిన కరుణాకరా మనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వరా వేసారిపోనయ్యా ధవళాంబరా (2) ||యేసయ్యా|| మండే నా బ్రతుకే పాటగా నిండైన నీ బ్రతుకే బాటగా పండంటి నీ ప్రేమ తోటలో మెండైన నీ వాక్యపు ఊటలో దొరికింది నా వరాల మూట సప్త స్వరాలే చాలవింక నా నోట (2) ||యేసయ్యా|| నలిగిన నా బ్రతుకే అర్పణమయ్యా వెలుగైన నీ వాక్యమే దర్పణమయ్యా మిగిలిన శ్రమలను సంతర్పణలో కదిలే కన్నీటి అర్చనలో పండింది నా నోముల పంట ఎంత పంచినా తరగదు ఈ దేటంట (2) ||యేసయ్యా|| నా దాగు చోటు నీవేనయ్యా చికాకు పడక నన్ను కాచేవయ్యా ఏకాకి నేనింక కాబోనయ్యా నీ రాక కోసమే ఉన్నానయ్యా శ్రీమంతుడా సాత్వికుడా పరిపూర్ణుడా కడు దీనుడా (2) ||యేసయ్యా||