ఆధారం నీవేనయ్యా

Aadhaarm Neevaenayyaa

Lyricistఎస్ రాజశేఖర్
UncategorizedAdded on 10/10/2016

Lyrics

ఆధారం నీవేనయ్యా
కాలం మారినా కష్టాలు తీరినా
కారణం నీవేనయ్యా
యేసయ్యా కారణం నీవేనయ్యా
||ఆధారం||
లోకంలో ఎన్నో జయాలు
చూసాను నేనింత కాలం
అయినను ఎందుకో నెమ్మది లేదు
సమాధానం కొదువైనది
యేసయ్యా సమాధానం కొదువైనది
||ఆధారం||
ఐశ్వర్యం కొదువేమి లేదు
కుటుంబములో కలతేమి లేదు
అయినను ఎందుకో నెమ్మది లేదు
సమాధానం కొదువైనది
యేసయ్యా సమాధానం కొదువైనది
||ఆధారం||
నీ సేవకునిగా జీవింప
హృదయంలో ఉన్నకోర్కెలను
హృదయము నిచ్చావు నెమ్మది నొందా
సాక్షిగా జీవింతును
హల్లేలూయ సాక్షిగా జీవింతును
||ఆధారం||

Video