ఆదియంతము లేనివాడా
Aadiymthamu Laenivaadaa
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 12/29/2021
Lyrics
ఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా దేవా నీతిజ్ఞానము కలవాడా జ్యోతికి నిలయము నీవే అబ్రాహామును పిలిచితివి – ఆ వంశమున బుట్టితివి అనాధులకు దిక్కు నీవే – అనాధుడవై వచ్చితివి ||ఆదియంతము|| ఇస్సాకును విడిపించి – యేసయ్యా బలియైనావా యూదాచే నమ్మబడితివి – పాపులకై మరణించితివి ||ఆదియంతము|| యోనావలె మూడు దినముల్ – భూగర్భమున నీవుండి మానవులను రక్షింప – మహిమతోడ లేచితివి ||ఆదియంతము|| పండ్రెండు గోత్రముల – జెంది – పండ్రెండు శిష్యుల జనకా కన్యపుత్రుడవై సీయోను – కన్యను వరించితివి ||ఆదియంతము|| దావీదు కుమారుడవు – దావీదుకు దేవుడవు కాపాడుచు నున్నావు – పాపిని నన్ను ప్రేమించి ||ఆదియంతము||