ఆహా హల్లెలూయా
Aahaa Hallelooyaa
UncategorizedAdded on 10/31/2020
Lyrics
అనిల్ కుమార్ వేముల తార జూపిన మార్గమదే… జ్ఞానులు చేరిన గమ్యమదే… గొల్లలు గాంచిన స్థానమదే… లోక రక్షకుని గూర్చినదే… ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమది ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా…. తార జూపిన మార్గమదే – జ్ఞానులు చేరిన గమ్యమదే గొల్లలు గాంచిన స్థానమదే – లోక రక్షకుని గూర్చినదే ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమది పరిశుద్ధ ప్రవక్తలు పలికినది – పరలోక సైన్యము పాడినది ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయ.. ఆహా హల్లెలూయ.. ఆహా హల్లెలూయా.. ఆహా హల్లే.. లూయా.. ||తార జూపిన|| దైవాజ్ఞను ధిక్కరించుటయే – పాపము ఓ సోదరా ఆ పాపముతో లోకమంతా – నిండిపోయెను సోదరీ పాపమేమో మరణమును వెంట దెచ్చెగా ఆ మరణమేమో నీకు నాకు సంక్రమించెగా భయము లేదు మనకింకా ఓ సోదరా అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా భయము లేదు మనకింకా ఓ సోదరీ అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా.. ఆ.. ఆ.. ఆ.. ||ఆహా హల్లెలూయా|| దైవ చిత్తము నెరవేర్చుటకే – క్రీస్తేసు పరము వీడగా పాప రుణమును చెల్లించుటకై – పావనుడే పుడమి చేరెగా (2) సిలువలో సాతాను తల చితకద్రొక్కెగా రుధిరమిచ్చి నిన్ను నన్ను శుద్ధి చేయగా బంధకములు తెంపబడెగా ఓ సోదరా సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా బంధకములు తెంపబడెగా ఓ సోదరీ సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా.. ఆ.. ఆ.. ఆ.. ||ఆహా హల్లెలూయా|| దైవ వాక్యము బోధించుటకు – పావనాత్మ పంపబడెగా లోక పాపము ఒప్పించుటయే – ఆదరణకర్త కార్యమాయెగా (2) అంధకారమంత బాపి వెలుగు నిచ్చుగా అనుదినము నిన్ను నన్ను నడిపించునుగా సందేహమేల సమయమిదే ఓ సోదరా నిను రక్షించుటకేసయ్య చేయి చాచగా సందేహమేల సమయమిదే ఓ సోదరీ నిను రక్షించుటకేసయ్య చేయి చాచగా… ఆ.. ఆ.. ఆ.. ||ఆహా హల్లెలూయా||