ఆహా మహాత్మ

Aahaa Mahaathma

Lyricistపంతగాని పరదేశి
UncategorizedAdded on 3/14/2017

Lyrics

ఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకా
ద్రోహ రహిత చంపె నిను నా – దోషమే కదా
||ఆహా||
వీరలను క్షమించు తండ్రి – నేరమేమియున్
కోరిటితుల నిన్ను చంపు – కౄర జనులకై
||ఆహా||
నీవు నాతో పరదైసున – నేడే యుందువు
పావనుండ ఇట్లు పలికి – పాపి గాచితి
||ఆహా||
అమ్మా నీ సుతుడ
టంచు మరి-యమ్మతో పలికి
క్రమ్మర నీ జనని యంచు – కర్త నుడితివి
||ఆహా||
నా దేవ దేవ యేమి విడ-నాడితి
వనుచు
శ్రీ దేవ సుత పలికితివి శ్రమ – చెప్ప శక్యమా
||ఆహా||
దప్పిగొనుచున్నాన
టంచు – చెప్పితివి కదా
యిప్పగిదిని బాధ నొంద – నేమి నీకు హా
||ఆహా||
శ్రమ ప్రమాద-ములను గొప్ప – శబ్ద మెత్తి హా
సమాప్తమైన
దంచు తెలిపి – సమసితివి కదా
||ఆహా||
అప్పగింతు తండ్రి నీకు – నాత్మ
నంచును
గొప్ప యార్భాటంబు చేసి – కూలిపోతివా
||ఆహా||

Video