ఆకాశమందు నీవుండగా
Aakaashammdu Neevumdagaa
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 6/15/2021
Lyrics
ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నీవీ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను శత్రుసమూహము నన్ను చుట్టినా సైతనుడు సంహరింపజూసినా నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను (2) ||ఆకాశమందు|| వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు మరణము మ్రింగగ కాంక్షించినా నేను దేనికి భయపడను (2) ||ఆకాశమందు|| పడిపోయిన వెనుకంజ వేయక పశ్చాత్తాపము పడి అడుగు నిను క్షమియించును నీ ప్రభువే నీవు ఎవరికి భయపడకు (2) ||ఆకాశమందు||