ఆకాశం అమృత జల్లులు

Aakaashm Amrutha Jallulu

UncategorizedAdded on 2/1/2017

Lyrics

ఈ లోకం ఆనందమయమై మురిసింది
అంతు లేని ఈ అనంత జగతిలో
శాంతి కొరవడి మసలుచుండగా
రక్షణకై నిరీక్షణతో
వీక్షించే ఈ అవనిలో
శాంతి సమతల కధిపతి నేడు జన్మించినాడనీ
||ఆకాశం||
పొంతన లేని వింత జగతిలో
పాపాంధకారం ప్రబలి యుండగా
సమ్మతిని మమతలను
పెంచుటకై ఈ పృథివిపై
ఆది దేవుడే ఆదరంబున ఉదయించినాడనీ
||ఆకాశం||