ఆకాశం నీ సింహాసనం
Aakaashm Nee Simhaasanm
UncategorizedAdded on 3/9/2023
Lyrics
జోయెల్ జశ్వంత్ గుమ్మడి ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాదపీఠం సర్వోన్నతుడా సర్వాధికారి అందుకో ఇల నా హృదయ వందనం అల్ఫయు నీవే ఒమేగయు నీవే – మార్గము నీవే – జీవము నీవే ||ఆకాశం|| పరలోక తెరపైట తొలగించగా స్తుతి గీత పాటలు వినిపించగా పరిశుద్ద ఆత్ముడు నను తాకగా రగిలింది నా మనస్సు ఒక జ్వాలగా ||ఆకాశం|| నీ స్వరము ఉరుమై వినిపించగా అదిరింది నా గుండె ఒకసారిగా నీ కిరణాలు మెరుపై నను తాకగా వెలిగింది నా మనస్సు ఒక జ్యోతిగా ||ఆకాశం|| భువిలోని సృష్ఠంత నీ మాటగా దివిలోని ఊపిరి నీ శ్వాసగా పరలోక రాజ్యానికి నువ్వు దారిగా వెలిసావు ధరపైన నా యేసుగా ||ఆకాశం||