ఆకర్షించే ప్రియుడా

Aakarshimchae Priyudaa

Lyricistథామస్
UncategorizedAdded on 2/17/2018

Lyrics

ఆకర్షించే ప్రియుడా…
అందమైన దైవమా…
ఆకర్షించే ప్రియుడా
అందమైన దైవమా
పరిపూర్ణమైనవాడా
నీదు తలపై ఉన్న అభిషేకం
అధికంగా సువాసన వీచుచున్నది
నీదు ప్రేమ చేతులు – ప్రేమించే చేతులు
నీదు ప్రేమ చూపులే నాకు చాలు
(2)      ||ఆకర్షించే||
నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది
నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి
నీదు ప్రేమ పాదం – పరిశుద్ధ పాదం
అదియే నేను వసియించే స్థలము
(2)      ||ఆకర్షించే||
నిన్ను పాడి హృదయం ఆనందించును
నాట్యంతో పాటలు పాడెదను
దేవాది దేవుడని – ప్రభువుల ప్రభువని
అందరికి నిన్ను చాటి చెప్పెదను
(2)      ||ఆకర్షించే||

Video