ఆనందము ప్రభు నాకొసగెను
Aanmdamu Prabhu Naakosagenu
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 10/9/2015
Lyrics
ఆనందము ప్రభు నాకొసగెను నా జీవితమే మారెను నా యుల్లమందు యేసు వచ్చెన్ నా జీవిత రాజాయెను (2) ||ఆనందము|| ప్రభుని రుచించి ఎరిగితిని ఎంతో ఎంతో ప్రేమాముర్తి విశ్వమంతట నే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను (2) ||ఆనందము|| సంతోషం సముద్రపు అలలన్ పోలి పైకి ఉప్పొంగి ఎగయుచుండె నన్ను పిలిచి ఎన్నో మేలులు చేసే నూతన జీవమొసగెన్ (2) ||ఆనందము|| శత్రువున్ ఎదిరించి పోరాడెదన్ విజయము పొంద బలమొందెదన్ ప్రభువుతో లోకమున్ జయించెదన్ ఆయనతో జీవించెదన్ (2) ||ఆనందము||