ఆనందింతు నీలో దేవా

Aanmdimthu Neelo Daevaa

Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 11/18/2016

Lyrics

ఆనందింతు నీలో దేవా
అనుదినం నిను స్తుతించుచు
మధురమైన నీ నామమునే
మరువక ధ్యానించెద ప్రభువా
||ఆనందింతు||
ఆత్మ నాథా అదృశ్య దేవా
అఖిల చరాలకు ఆధారుండా
అనయము నిను మది కొనియాడుచునే
ఆనందింతు ఆశ తీర
(2)         ||ఆనందింతు||
నాదు జనములు నను విడచినను
నన్ను నీవు విడువకుండా
నీ కను దృష్టి నాపై నుంచి
నాకు రక్షణ శృంగమైన
(2)         ||ఆనందింతు||
శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకు
మేఘమందు రానైయున్న
ఆ ఘడియ ఎప్పుడో ఎవరికి తెలుసు
అంతం వరకును భద్రపరచుము
(2)         ||ఆనందింతు||
శ్రమలు నన్ను చుట్టిన వేళ
చింతలో కృశించిన వేళ
అభయముగా నీ దర్శనమిచ్చి
శ్రమలు బాపి శాంతినిచ్చితివి
(2)         ||ఆనందింతు||

Video