ఆనందింతుము

Aanmdimthumu

Lyricistజాషువా అరసవెల్లి
UncategorizedAdded on 8/31/2019

Lyrics

ఆనందింతుము ఆనందింతుము
యేసుని సన్నిధిలో ఆనందింతుము.. హే
గంతులేసి నాట్యమాడి
ఉత్సహించి పాడెదం
యేసుని సన్నిధిలో ఆనందింతుము
(2)      ||ఆనందింతుము||
భయమూ ఎందుకూ… దిగులూ ఎందుకూ
దేవాది దేవుని తోడు మనకుండగా
హల్లెలూయ అంటు ఆరా-ధింతుము ఎల్లప్పుడూ
యేసుని సన్నిధిలో ధైర్యమొందెదం
(2)      ||ఆనందింతుము||
నీతి లేని లోకంతో స్నేహం ఎందుకూ
నీతి సూర్యుడైన యేసు మనకూ ఉండగా
పరిశుద్దుడంటూ పొగడి కొలిచెదము అనుదినం
యేసుని సన్నిధిలో పరవశించెదం
(2)      ||ఆనందింతుము||
ప్రేమలేని హితుల సఖ్యం ఎందుకూ
ప్రేమామయుడైన ప్రభువు మనకు ఉండగా!
మహిమకరుడు అంటూ మ్రొక్కి పూజింతుము అనుక్షణం
యేసుని సన్నిధిలో ఉత్సాహించెదం
(2)      ||ఆనందింతుము||