ఆనందం నీలోనే

Aanmdm Neelonae

Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 7/28/2020

Lyrics

ఆనందం నీలోనే – ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే – నా యేసయ్యా – స్తోత్రార్హుడు
అర్హతేలేని నన్ను – ప్రేమించినావు
జీవింతు ఇలలో – నీ కోసమే – సాక్ష్యార్థమై
||ఆనందం||
పదే పదే నిన్నే చేరగా
ప్రతిక్షణం నీవే ధ్యాసగా
కలవరాల కోటలో – కన్నీటి బాటలో
కాపాడే కవచంగా – నన్ను ఆవరించిన
దివ్యక్షేత్రమా – స్తోత్రగీతమా
||ఆనందం||
నిరంతరం నీవే వెలుగని
నిత్యమైన స్వాస్థ్యం నీదని
నీ సన్నిధి వీడక – సన్నుతించి పాడనా
నీకొరకే ధ్వజమెత్తి నిన్న ప్రకటించనా
సత్యవాక్యమే – జీవవాక్యమే
||ఆనందం||
సర్వసత్యమే నా మార్గమై
సంఘక్షేమమే నా ప్రాణమై
లోక మహిమ చూడక – నీ జాడలు వీడక
నీతోనే నిలవాలి నిత్య సీయోనులో
ఈ దర్శనం – నా ఆశయం
||ఆనందం||

Video