ఆరాధనా నీకే ఆరాధనా
Aaraadhanaa Neekae Aaraadhanaa
Lyricistజోయెల్ ఎన్ బాబ్
UncategorizedAdded on 4/1/2021
Lyrics
ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా యేసు అన్ని వేళలా నా కష్టాలలో ఆరాధన శోక సంద్రములో నీకే ఆరాధన నా నష్టాలలో ఆరాధన లోకమే నను విడచినా నీకే ఆరాధన ||ఆరాధనా|| ఓటములే నాకు మిగిలినా – కన్నీట నిండ మునిగినా ఆదరించు యేసుని చూస్తూ ఆరాధన నా ప్రియులే చేయి విడచినా – సిరులున్నా లేక పోయినా నను విడువని యేసుని చూస్తూ ఆరాధన యేసయ్యా నీకే నా ఆరాధన యేసయ్యా నీకే నా స్తుతి కీర్తన (2) ||ఆరాధనా|| రోగములే క్షీణించినా – శాంతిలేక కుమిలిపోయినా సర్వమును భరించు యేసుకే ఆరాధన శొధనలే చుట్టుముట్టినా – పాపములే రాజ్యమేలినా లోకాన్ని గెలిచిన యేసుకే ఆరాధన యేసయ్యా నీకే నా ఆరాధన యేసయ్యా నీకే నా స్తుతి కీర్తన (2) ||ఆరాధనా||