ఆరాధనకు యోగ్యుడా

Aaraadhanaku Yogyudaa

Lyricistజ్యోతి రాజు
UncategorizedAdded on 8/19/2017

Lyrics

ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను
నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను
ఆరాధన ఆరాధన
నీ మేలులకై ఆరాధన – నీ దీవెనకై ఆరాధన
ఆరాధన ఆరాధన
దినమెల్ల నీ చేతులు చాపి
నీ కౌగిలిలో కాపాడుచుంటివే
నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై
నా పూర్ణ హృదయముతో సన్నుతింతును
ఆరాధన ఆరాధన
నీ ప్రేమకై ఆరాధన – నీ జాలికై ఆరాధన
ఆరాధన ఆరాధన
ధనవంతులుగా చేయుటకు
దారిద్య్రత ననుభవించినావు
హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా
పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను
ఆరాధన ఆరాధన
నీ కృప కొరకై ఆరాధన – ఈ స్థితి కొరకై ఆరాధన
ఆరాధన ఆరాధన
(2)          ||ఆరాధనకు||

Video