ఆరాధించెద

Aaraadhimcheda

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 3/17/2016

Lyrics

ఆరాధించెద నిను మది పొగడెద
నిరతము నిను స్తుతియించెదను
మార్గము నీవే సత్యము నీవే
జీవము నీవే నా ప్రభువా
(2) ||ఆరాధించెద||
విస్తారంబగు వ్యాపకములలో
విడచితి నీ సహవాసమును
సరిదిద్దితివి నా జీవితము
నిను సేవింపగ నేర్పిన ప్రభువా
(2) ||ఆరాధించెద||
నీ రక్తముతో నను కడిగితివి
పరిశుద్దునిగా జేసితివి
నీ రక్షణకై స్తోత్రము చేయుచు
నిత్యము నిన్ను కొనియాడెదను
(2) ||ఆరాధించెద||
పెద్దలు పరిశుద్దులు ఘన దూతలు
నీ సన్నిధిలో నిలచిననూ
లెక్కింపగజాలని జనమందున
నను గుర్తింతువు నా ప్రియ ప్రభువా
(2) ||ఆరాధించెద||

Video

Aaraadhimcheda Lyrics | Shining Christians