ఆరాధించెదము ఆత్మతో

Aaraadhimchedamu Aathmatho

UncategorizedAdded on 5/23/2020

Lyrics

ఆరాధించెదము ఆత్మతో నిరతము
యెహోవా దేవుని మనమంతా
ఆనంద గానము మనసారా పాడుచు
అనుదినం కీర్తింతుము రారాజును –
(2)       ||ఆరాధించెదము||
అక్షయ నాథుడు అద్వితీయుడు
పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు
ఆద్యంత రహితుడు అదృశ్య రూపుడు
అమరుడై యున్నవాడు మన దేవుడు
(2)       ||ఆరాధించెదము||
సత్య స్వరూపి మహోన్నతుడు
మహిమాన్వితుడు మనకును తండ్రియే
ప్రభువైన క్రీస్తుకు తండ్రియైన దేవుడు
పరమందు ఆసీనుడు పూజార్హుడు
(2)       ||ఆరాధించెదము||
సమస్తమునకు జీవాధారుడై
శ్రేష్ఠ ఈవులనిడు జ్యోతిర్మయుడై
భువియందు కృప జూపు కరుణా సంపన్నుడు
యుగములకు కర్తయే శ్రీమంతుడు
(2)       ||ఆరాధించెదము||

Video