ఆరని ప్రేమ ఇది

Aarani Praema Idi

Lyricistఅంశుమతి మేరి
UncategorizedAdded on 1/24/2021

Lyrics

ఆరని ప్రేమ ఇది – ఆర్పజాలని జ్వాల ఇది
అతి శ్రేష్టమైనది – అంతమే లేనిది
అవధులే లేనిది – అక్షయమైన ప్రేమ ఇది
కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది
సింహాసనము నుండి – సిలువకు దిగి వచ్చినది
బలమైనది మరణము కన్నా – మృతిని గెల్చి లేచినది
ఇది సజీవమైనది – ఇదే సత్యమైనది
ఇదే నిత్యమైనది – క్రీస్తు యేసు ప్రేమ ఇది
కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది
నా స్థానమందు నిలిచి – నా శిక్షనే భరియించి
క్రయ ధనమును చెల్లించి – గొప్ప రక్షణ నిచ్చినది
నాకు విలువ నిచ్చినది – నన్ను వెలిగించినది
ఆ ఉన్నత రాజ్యమందు – నాకు స్థానమిచ్చినది
ఉన్నత ప్రేమ ఇది – అత్యున్నత ప్రేమ ఇది
భూ రాజులు అధిపతులు – రాజ్యాలు అధికారాలు
చెరయైనా ఖడ్గమైనా – కరువైనా ఎదురైన
ఎవరు ఆర్పలేనిది – ఎవరు ఆపలేనిది
ప్రవహించుచున్నది – ప్రతి పాపి చెంతకు
ప్రేమ ప్రవాహమిది – యేసు ప్రేమ ప్రవాహమిది

Video