ఆశతో నీ కొరకు

Aashatho Nee Koraku

Lyricistఅబ్రహాం
UncategorizedAdded on 11/6/2019

Lyrics

ఆశతో నీ కొరకు ఎదురుచూచుచుండగా .
నూతన బలముతో నను నింపినావు
బలహీనులను బలపరచువాడా
కృంగిన వారిని లేవనెత్తువాడా
యేసయ్యా నా ఆశ్రయమా
యేసయ్యా నీకే ఆరాధన
సొమ్మసిల్లక అడుగులు తడబడక
నడిచెద నీ వెంట జీవితమంతా
లోకము నన్ను ఆకర్షించినా
వెనుదిరుగక నేను సాగెద నీ వెంట
(2)     ||యేసయ్యా||
అలయక నేను పరుగెత్తెదను
అంతము వరకు ఆత్మల రక్షణకై
సిద్ధము చేసిన బహుమానముకై
గురియొద్దకే నేను సాగెదనయ్యా
(2)     ||యేసయ్యా||
రెక్కలు చాపి పక్షి రాజువలెనే
పైకెగెరెద నీ పరిశుద్ధులతో
పరవశించెదను నీ ముఖమును చూచి
ప్రణమిల్లెద నీ పాదముల చెంత
(2)     ||యేసయ్యా||

Video