ఆశ్చర్యాకరుడా (యేసన్న)
Aashcharyaakarudaa Yaesanna
Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 1/22/2018
Lyrics
ఆశ్చర్యాకరుడా నా ఆలోచన కర్తవు నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజువు సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలిగొనినా నీ పిల్లలు – ఆకలితో అలమటింతురా నీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా|| విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు నీ పిల్లలు – వాటికంటే శ్రేష్టులే కదా నీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా|| చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించె నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా||