ఆశ్చర్యమైన ప్రేమ
Aashcharyamaina Praema
Lyricistజక్కి దేవరాజ్
UncategorizedAdded on 11/30/2014
Lyrics
ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ మరణము కంటె బలమైన ప్రేమది నన్ను జయించె నీ ప్రేమ ఆశ్చర్యమైన పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే || ఆశ్చర్యమైన పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే || ఆశ్చర్యమైన శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు || ఆశ్చర్యమైన నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే || ఆశ్చర్యమైన