ఆశీర్వాదంబుల్ మా మీద

Aasheervaadmbul Maa Meeda

UncategorizedAdded on 10/9/2015

Lyrics

డేనియల్ డబ్ల్యూ విట్టల్
ఆశీర్వాదంబుల్ మా మీద
వర్షింపజేయు మీశ
ఆశతో నమ్మి యున్నాము
నీ సత్య వాగ్దత్తము
ఇమ్మాహి మీద
క్రుమ్మరించుము దేవా
క్రమ్మర ప్రేమ వర్షంబున్
గ్రుమ్మరించుము దేవా
ఓ దేవా పంపింపవయ్యా
నీ దీవెన ధారలన్
మా దాహమెల్లను బాపు
మాధుర్యమౌ వర్షమున్
|| ఇమ్మాహి ||
మా మీద కురియించు మీశ
ప్రేమ ప్రవాహంబులన్
సమస్త దేశంబు మీద
క్షామంబు పోనట్లుగన్
|| ఇమ్మాహి ||
ఈనాడే వర్షింపు మీశ
నీ నిండు దీవెనలన్
నీ నామమందున వేడి
సన్నుతి బ్రౌర్ధింతుము
|| ఇమ్మాహి ||

Video