ఆశ్రయదుర్గమా

Aashrayadurgamaa

Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 10/11/2016

Lyrics

ఆశ్రయదుర్గమా – నా యేసయ్యా
నవజీవన మార్గమునా – నన్ను నడిపించుమా
ఊహించలేనే నీ కృపలేని క్షణమును
కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే
||ఆశ్రయ||
లోక మర్యాదలు మమకారాలు గతించి పోవునే
ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి
(2)        ||ఆశ్రయ||
నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటివే
నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి
(2)        ||ఆశ్రయ||
పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను
నీ శిక్షణలో అనుకవతోనే నీకృ పొందెద
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి
(2)        ||ఆశ్రయ||
నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించెదనే
ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది
స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా
హల్లేలూయా – హల్లేలూయా – హల్లెలూయా
(2)        ||ఆశ్రయ||

Video