ఆశ్రయమా ఆధారమా

Aashrayamaa Aadhaaramaa

Lyricistకే వై రత్నం
UncategorizedAdded on 5/30/2018

Lyrics

ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా
నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా
నిను విడచి నేనుండలేను
క్షణామైనా నే బ్రతుకలేను
(2)       ||ఆశ్రయమా||
కష్ట కాలములు నన్ను కృంగదీసినను
అరణ్య రోదనలు నన్ను ఆవరించినను
నా వెంటే నీవుండినావు
నీ కృపను చూపించావు
(2)       ||ఆశ్రయమా||
భక్తిహీనులు నాపై పొర్లిపడినను
శత్రు సైన్యము నన్ను చుట్టి ముట్టినను
నా వెంటే నీవుండినావు
కాపాడి రక్షించినావు
(2)       ||ఆశ్రయమా||
మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను
బంధు స్నేహితులు నన్ను బాధపెట్టినను
నా వెంటే నీవుండినావు
దయచూపి దీవించినావు
(2)       ||ఆశ్రయమా||

Video