ఆత్మ వర్షమును

Aathma Varshamunu

UncategorizedAdded on 11/26/2018

Lyrics

ఆత్మ వర్షమును కుమ్మరించయ్యా
ఆత్మ వర్షమును కుమ్మరించయ్యా
నీ ఆత్మ చేత అభిషేకించి
నీ కృప చేత బలపరచయ్యా
నే ఉన్నది నీ కోసమే యేసయ్యా
నీ సింహాసనం చేరితినయ్యా
||ఆత్మ||
బలహీనతతో నన్ను బలపరచుము
ఒంటరైన వేళలో ధైర్యపరచుము
కృంగిన వేళ నీ దరి చేర్చి
నీ ఆత్మ శక్తితో బలపరచయ్యా
(2)           ||నే ఉన్నది||
ఆత్మీయుడవై నన్ను ఆదరించుము
అలసిన వేళ దర్శించుము
అవమానములో నీ దరి చేర్చి
నీ ఆత్మ శక్తితో స్థిరపరచయ్యా
(2)           ||నే ఉన్నది||