ఆత్మ విషయమై

Aathma Vishayamai

UncategorizedAdded on 9/13/2017

Lyrics

పి విజయ్ కుమార్
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు
పరలోక రాజ్యము వారిది
దుఃఖ పడు వారలు ధన్యులు
వారు ఓదార్చబడుదురు
సాత్వికులైన వారు ధన్యులు
వారు భూలోకమును స్వతంత్రించుకొందురు
(2)     ||ఆత్మ||
నీతిని ఆశించువారు ధన్యులు
వారు తృప్తిపరచబడుదురు
కనికరము గలవారు ధన్యులు
వారు దేవుని కనికరము పొందుదురు
(2)     ||ఆత్మ||
హృదయ శుద్ధి గలవారు ధన్యులు
వారు దేవుని చూచెదరు
సమాధాన పరచువారు ధన్యులు
వారు దేవుని కుమారులనబడుదురు
(2)     ||ఆత్మ||

Video

Aathma Vishayamai Lyrics | Shining Christians