ఆత్మీయ గానాలతో
Aathmeeya Gaanaalatho
Lyricistఆడమ్ బెన్ని
UncategorizedAdded on 8/25/2018
Lyrics
ఆత్మీయ గానాలతో నిన్నే ఆరాధన చేయనా స్తుతి స్తోత్ర గీతాలతో నీ నామము పూజించనా మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుచున్నానయ్యా ఆరాధించనా నీ పాద సన్నిధి స్తుతి పాత్రుడా – స్తోత్రార్హుడా ఆరాధనా నీకే ఆరాధనా (2) ||ఆత్మీయ|| సమీపించరాని తేజస్సులో వసియించుచున్న పరిశుద్ధుడా కెరూబులు సెరాపులు దీవా రాత్రులు నీ సన్నిధిలో స్తోత్రం చేసెనా నా ప్రాణ నాథుడా (2) ||స్తుతి పాత్రుడా|| అందరిలోను అతి శ్రేష్టుడా వేల్పులలోన మహనీయుడా పూజార్హుడా స్తోత్రార్హుడా అతి సుందరుడా మనోహరుడా చేతులెత్తనా నీ సన్నిధి కాంతిలో (2) ||స్తుతి పాత్రుడా|| అగ్ని జ్వాలల వంటి నేత్రాలు గలవాడా అపరంజిని పోలిన పాదాలు గలవాడా (దేవా) విస్తార జల నదుల శబ్దము పోలిన స్వరమును కలిగిన ఘననీయుడా శిరము వంచనా సర్వోన్నతుడా (2) ||స్తుతి పాత్రుడా||