ఆయనే నా సంగీతము
Aayanae Naa Smgeethamu
Lyricistఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
UncategorizedAdded on 11/5/2013
Lyrics
ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము ||ఆయనే|| స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే వేడుచుండు భక్తుల స్వరము విని దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే ||ఆయనే|| ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండెదననిన మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము ||ఆయనే|| సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము రాకడలో ప్రభుతో నిత్యముందుము మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము ||ఆయనే||