ఏ గుంపులో నున్నావో

Ae Gumpulo Nunnaavo

UncategorizedAdded on 5/31/2018

Lyrics

ఏ గుంపులో నున్నావో
ఎరిగి తెలుసుకో – గుర్తెరిగి తెలుసుకో
జాగు చేయక వేగ మేలుకో
(2)       ||ఏ గుంపులో||
మరణమనెడి మొదటి గుంపు
మారని గుంపు – నిర్జీవపు గుంపు
దురాత్మ బలముతో తిరిగెడి గుంపు
(2)       ||ఏ గుంపులో||
మెచ్చుఁకొనుట కిచ్చకంబు
లాడెడి గుంపు – నులివెచ్చని గుంపు
చచ్చియుండిన సమాధుల గుంపు
(2)       ||ఏ గుంపులో||
కరుణ లేక కఠినమైన
కరుగని గుంపు – గుర్తెరుగని గుంపు
కరకు కల్గిన కఠోరపు గుంపు
(2)       ||ఏ గుంపులో||
యేసు వాక్యమనగ నేమో
ఎరుగని గుంపు – విననియ్యని గుంపు
ముద్ర వేసిన మూర్ఖుల గుంపు
(2)       ||ఏ గుంపులో||
ధరణి నరుల తరిమి కొట్టు
దయ్యపు గుంపు – అదే కయ్యపు గుంపు
పరమ తండ్రిని ఎదిరించెడి గుంపు
(2)       ||ఏ గుంపులో||
పరమ తండ్రి కడకు జేర
పరుగులెత్తెడి – నిరపరాధ జనులకు
కావలి కాయు కఠినాత్ముల గుంపు
(2)       ||ఏ గుంపులో||
సర్వ లోక మోసగాడు
ఆది సర్పము – అదే ఘట సర్పము
సర్వ భక్తుల బరి మార్చెడి గుంపు
(2)       ||ఏ గుంపులో||
వధువు మంద మేయు మర్మ
మనగ గమనిక – గమనించి తెలుసుకో
గదిలో చేరుకో పదిలపర్చుకో
(2)       ||ఏ గుంపులో||