ఏ నామములో
Ae Naamamulo
Lyricistఅను శామ్యూల్
UncategorizedAdded on 12/18/2021
Lyrics
ఏ నామములో సృష్టి అంతా సృజింపబడెనో ఆ నామమునే స్తుతింతును ఏ నామములో పాపమంతా క్షమించబడెనో ఆ నామమునే పూజింతును ఏ నామములో దావీదు గోలియాతును ఎదురించెనో ఆ నామమునే నమ్మెదను ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగునో ఆ నామమునే స్మరింతును నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను నీ నామమే నా జయము రోగము తలవంచును నీ నామము ఎదుట శాపము తల వంగును నీ నామము ఎదుట సాటిలేని నామము – స్వస్థపరచే నామము (2) ||నీ నామమునే|| ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత శ్రేష్టమైన నామము – శక్తిగలిగిన నామము (2) ||నీ నామమునే|| హెచ్చింపబడును గాక నీ నామము యేసయ్యా కీర్తింపబడును గాక నీ నామము యేసయ్యా కొనియాడబడును గాక నీ నామము యేసయ్యా అన్ని నామములకు పై నామముగా అన్ని నామములకు పై నామముగా – (3) ||నీ నామమునే||