ఏ రీతి స్తుతియింతునో
Ae Reethi Sthuthiyimthuno
UncategorizedAdded on 10/13/2016
Lyrics
నేరములెంచని వాడా – నాదు నజరేయుడా తీరము దాటిన వాడా – నాదు గలలీయుడా ఏ రీతి స్తుతియింతునో… నా ప్రాణ నాధుండా – నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడనో యేసువా ||ఏ రీతి|| మహిమ నగరిని విడిచితివి – మంటి దేహము దాల్చితివి సకల సంపద విడచితివి – సేవకునిగా మారితివి (2) ||నా ప్రాణ|| వెదకి నను ఇల చేరితివి – వెంబడించగ పిలచితివి రోత బ్రతుకును మార్చితివి – నీదు సుతునిగ జేసితివి (2) ||నా ప్రాణ|| ఇంత ప్రేమకు కారణము – ఎరుగనైతిని నా ప్రభువా ఎన్న తరమా నీ ప్రేమ – సన్నుతించుచు పాడెదను (2) ||నా ప్రాణ||