ఏ యోగ్యతా లేని నన్ను
Ae Yogyathaa Laeni Nannu
UncategorizedAdded on 3/14/2017
Lyrics
ఏ అర్హతా లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా నీకేమి చెల్లింతును నీ ఋణమెలా తీర్తును (2) ||ఏ యోగ్యతా|| కలుషితుడైన పాపాత్ముడను నిష్కళంకముగా నను మార్చుటకు పావన దేహంలో గాయాలు పొంది రక్తమంత చిందించినావా ||నీకేమి|| సుందరమైన నీ రూపమును మంటివాడనైన నాకీయుటకు వస్త్రహీనుడుగా సిలువలో వ్రేళాడి నీ సొగసును కోల్పోయినావా ||నీకేమి|| పాపము వలన మృతినొందిన అపరాధినైన నను లేపుటకు నా స్థానమందు నా శిక్ష భరించి మరణించి తిరిగి లేచావా ||నీకేమి||