ఏడానుంటివిరా
Aedaanumtiviraa
UncategorizedAdded on 8/9/2017
Lyrics
వేగి ఉరికి రారా – ఓరన్న యాదికొచ్చెరా యాదన్న యేసు సిత్ర కథ వినరన్న ఏలియాలో ఏలియాలో ఏలియాలో యేసే నా రక్షకుడు ఏలియాలో హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా యేసే నా రక్షకుడు హల్లెలూయా యూదా దేశమందు – ఓరన్న బెత్లెహేమునందు – ఓరన్న పశువుల శాలయందు – ఓరన్న ప్రభు యేసు జన్మించె – ఓరన్న చుక్కల రెక్కలు ఎగుర వేయుచు చల్లని దూతలు పాట పాడిరి చల్ల చల్లని చలిలోన – ఓరన్న గొల్ల గొల్లలు మ్రొక్కిరి – ఓరన్న (2) ||ఏలియాలో|| పెద్ద పెద్దని వాడై – యేసన్న ఇంత ఇంతింత ఎదిగె – యేసన్న వింత వింతలు చేసె – యేసన్న ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచెను తుఫాను నణిచెను – యేసన్న సంద్రాన నడిచెను – యేసన్న (2) ||ఏలియాలో|| ఏ పాపమెరుగని – ఓరన్న యేసయ్య తండ్రిని – ఓరన్న సిలువ వేయమని – ఓరన్న కేకలు వేసిరి – ఓరన్న సిలువ మోసెను శ్రమల నోర్చెను మూడవ నాడు తిరిగి లేచెను పరలోకమెళ్లాడు – యేసన్న త్వరలోనే వస్తాడు – యేసన్న (2) ||ఏలియాలో||